PS Telugu News
Epaper

వివిధ దేవాలయాల వార్షికోత్సవాల్లో పాల్గొన్న

📅 11 Nov 2025 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా గ్రామంలో హరే రామ హరే కృష్ణ పారాయణం 21వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శాంతిహోమం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట అనూష మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.అలాగే కొందుర్గు మండలం ముట్పూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వార్షికోత్సవంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల వైస్ ఎంపీపీ పసుల నరసింహ యాదవ్, కొందుర్గు మండల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇసునాతి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సుధాకర్ అప్ప, జిల్లా నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి, బోయ అశోక్, జట్టూరి గోపాల్ రెడ్డి, వీరేషం, ప్రకాష్ రెడ్డి, శివకుమార్, మహేందర్, కృష్ణయ్య గ్రామ పెద్దలు కోక్కల్ల భాస్కర్ బుర్రి భూపాల్ రెడ్డి, బుర్రి అంతిరెడ్డి, భావనల రాజు, బండ శేఖర్, నిజం జంగయ్య, చాకలి మహేందర్, బండ నరేందర్, నిదురం రాజు, చాకలి వినోద్, మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Scroll to Top