చించొడ్ ప్రభుత్వ పాఠశాలలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం
సమగ్ర శిక్ష పీఎంశ్రీ జెండర్ ఏక్విటీ సేఫ్ డిఫెన్సె ప్రోగ్రాము
( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
చించొడ్ హై స్కూల్లో అమ్మాయిలకు కరాటే క్లాసులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చించొడ్ హై స్కూల్ ఇంచార్జ్ రామచంద్రయ్య మాట్లాడుతూ… ఈరోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అగైతాలను గుర్తుపెట్టుకుని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ కలలు నేర్పించడం చాలా అవసరము అని అంటూ ఈ యొక్క కరాటే నేర్పడం వలన అమ్మాయిలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది అలాగే దృఢంగా ఉంటారు చదువుపై చక్కటి శ్రద్ధతో చదువుకుంటారని అలాగే R S కరాటే మాస్టర్ ని మా అమ్మాయిలకు చక్కగా నేర్పి అన్ని విషయాలలో ముందుకు తీసుకెళ్లాలని ఇన్చార్జి రామచంద్రయ్య తెలిపారు .ఈ కార్యక్రమంలో నటరాజ్ మరియు రవి మరియు ఫిజికల్ డైరెక్టర్ చెంద్రశేఖర్ కరాటే మాస్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు