PS Telugu News
Epaper

హన్మకొండ క్రీడా పాఠశాలలో సీటు సాధించిన కర్ని విద్యార్థిని సావిత్రమ్మకు ఘన సన్మానం

📅 11 Nov 2025 ⏱️ 7:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

//పయనించే సూర్యుడు// నవంబర్ 12/మక్తల్

తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చి, హన్మకొండ క్రీడా పాఠశాల లో సీటు సాధించిన MPPS కర్ని విద్యార్థిని కుమారి సావిత్రమ్మ*ను ZPHS కర్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు *వెంకటయ్య గౌడ్ మరియు పాఠశాల PSHM రమేష్ గాయత్రి , కోచ్ పీడీ బీ. రూప ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విద్యార్థినిని 9 క్రీడ అంశాలలో నిరంతరం ప్రోత్సహించి, మెరుగైన శిక్షణ ఇచ్చిన, క్రీడా రంగంలో ముందుకు నడిపిన కోచ్PD శ్రీమతి బి. రూప ను కూడా సన్మానించి, అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మారుతి, D. వెంకటేష్, రమ్య,కల్పన తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు కూడా హాజరై, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Scroll to Top