ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి..
సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి..
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి..
వాగ్మారే మహేందర్ PDSU జిల్లా అధ్యక్షులు..
నిర్మల్ జిల్లా నవంబర్ 12 పయనించే సూర్యుడు ప్రతినిధి కే చక్రపాణి.
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో,బుధవారం డా”బిఆర్, అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు 200 మంది విద్యార్థులతో నిరసన ర్యాలి, ప్రదర్శన చేపట్టారు.ఈ సoధర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు వి.మహేందర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా దాదాపుగా 8-9 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు .
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా, విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తుoదని అన్నారు.రియాంబర్స్ మెంట్ విడుదల కాక కళాశాలల నిర్వహణ కష్టమై ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యల్లో కళాశాలలు ముతపడ్డాయని తెలియజేశారు.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, విద్యాశాఖ మంత్రినీ కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.మరియు నిర్మల్ జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ప్రతి నెల 500/- కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు పవార్ కిరణ్, PDSU రాష్ట్ర నాయకులు అనిల్, మరియు PDSU జిల్లా నాయకులు అద్విత్,గంగరాజు, ధ్రువ మరియు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
