PS Telugu News
Epaper

మహిళ అక్రమ రవాణా లైంగికంగా వేధింపులు డ్రగ్స్ పై అవగాహన సదస్సు

📅 12 Nov 2025 ⏱️ 5:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మధు శ్రీవత్సవ స్టూడెంట్ కౌన్సిలర్ బి. శివకుమార్”

(పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్)

ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ప్రిన్సిపల్ శ్రీ మధుశ్రీవత్సవ స్టూడెంట్ కౌన్సిలర్ బి.శివకుమార్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మహిళ అక్రమ రవాణా మరియు gbలైంగిక వేధింపులు, డ్రగ్స్ నివారణ మొదలైన అంశాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మత్తు పానీయాలు విసర్జించడంలో ప్రముఖ పాత్ర పోషించడంతోపాటు మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు మీ దృష్టికి వచ్చినట్లయితే వాటిపై అప్రమత్తతతో వ్యవహరించి వాటి నివారణకు స్వచ్ఛంద తోడ్పాటును అందించాలని ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా కళాశాల విద్యార్థి కౌన్సిలర్ శివకుమార్ మాట్లాడుతూ మహిళ అక్రమ రవాణా లైంగిక వేధింపులు మొదలైన అంశాల పట్ల సరైన సహాయక చర్యలు తీసుకోవడానికి విద్యార్థినీ విద్యార్థులు ఒక వాలంటీర్ గా పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎం. సంపత్ కుమార్, ఎస్. దయానంద్, జె.భాగ్యమ్మ కే. శ్రీనివాస్ బి. రమ్య తదితరులు పాల్గొని ఇంటర్ విద్య పరిషత్ డైరెక్టర్ గారు అందజేసినటువంటి పోస్టర్లను కళాశాల ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది.

Scroll to Top