PS Telugu News
Epaper

వైస్సార్ సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న వై.సీ.పీ. నాయకులు.

📅 12 Nov 2025 ⏱️ 6:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 12(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి మండల కేంద్రంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ గా బయలుదేరి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న కుట్రలను ఆపాలని యాడికి మండల తహశిల్దారు గారికి వినతిపత్రం అందజేస్తు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలనపేద విద్యార్థులకు విద్య, ప్రజలకు వైద్యం కరువు అవుతుంది కావున ఎట్టి పరిస్థులలో ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న కుట్రలను ఆపాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వై.సి.పి. ఎస్.ఈ.సి.మెంబర్ బొంబాయి రమేష్ నాయుడు, వై.సీ.పీ. సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు, వై.సి.పి.రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వెన్నపూస వెంకటరామిరెడ్డి, నగురూరు బ్రహ్మానందరెడ్డి, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, మండల కన్వీనర్ సంజీవ రాయుడు, వై.సీ.పీ.కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top