PS Telugu News
Epaper

బజాజ్ వీధిలో ముమ్మర తనిఖీలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్

📅 12 Nov 2025 ⏱️ 6:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 12 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ కె .చిన్నయ్య ఆధ్వర్యంలో పట్టణములోని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.*ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాల వారు
120 మైక్రాన్ న్స్ లోపు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం పరిశీలించి నిషేధం మైనవి దాదాపు 30 కేజీలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్వాధీనం చేసుకొని జరిమానా రూ 1700/- విధించడంమైనది అటులనే తమ చెత్తను రోడ్లపై పడవేయకుండా, డబ్బాల ద్వారా నిర్వహించుకుని మున్సిపల్ సిబ్బందికి అందజేయవలేనని మరియు ఆహార పదార్థాలు తయారు చేయువారు పరిశుభ్ర వాతావరణంలో చేయవలెనని, మరియు వాణిజ్య సముదాయాల వారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని వాటి స్థానంలో జ్యూట్ లేదా క్లాత్ బ్యాగ్లు ఉపయోగించాలని అటులనే చికెన్ మరియు మటన్ షాపులు వారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు తగ్గించాలని అన్ని తెలియజేశారు.అట్లు కాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించు వారిపై నోటీసులు జారీ చేసి క్రమశిక్షణ చర్యలు ఉపక్రమించబడతాయని మరియు భారీ స్థాయిలో జరిమానా విధించి వారి యొక్క ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి షాపు సీజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటర్లు, శానిటరీ మేస్త్రిలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Scroll to Top