PS Telugu News
Epaper

కర్ణంకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📅 12 Nov 2025 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే శంకర్

( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం పుచ్చర్లకుంట తాండ పరిధిలోని కరణం కుంట తండా గ్రామానికి చెందిన ఓ గిరిజన జంటకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ ఇంటి గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కూతురు శిరీష తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ అమ్మా నాన్నకు ఒక ఇల్లు ఉంటే చాలు అని కలగన్నామని, ఆ కలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూర్తి చేశారని, దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె కన్నీటి పర్యంతమై తన కృతజ్ఞత తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ఉన్నది పేదవాళ్లకోసమేనని, వారికి సేవ చేయడం తమ ముందున్న బాధ్యత అని వివరించారు. అంతేకాకుండా బాలికతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో నృత్యం చేసి ఆయన అలరించారు. అనంతరం లబ్ధిదారులు కవిత, మోహన్ దంపతులతో కలిసి ఆయన సన్నబియ్యంతో భోజనం చేశారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు..

Scroll to Top