విజయ్ దేవరకొండ–రష్మిక బంధం పై మరోసారి హాట్ టాక్: కొత్త వ్యాఖ్య వైరల్
పయనించే సూర్యుడు న్యూస్ :రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. ఆయనేం మాట్లాడుతారనే విషయం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ఈవెంట్‌కు వచ్చిన ఈ యంగ్ స్టార్ రష్మిక చేయిని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆమె పేరుని ప్రస్తావించాల్సిన ప్రతీసారి ‘రషి’ అని పిలిచాడు. ఇది వేడుకలో హైలెట్ అంశాలుగా మారాయి. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘‘ది గర్ల్ ఫ్రెండ్’ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు ఆపుకున్నాను. లోపల బరువైన టైట్ ఫీలింగ్ కలిగింది. రీసెంట్ సినిమాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్. సినిమాలో చూసిన రిలేషన్ షిప్ చూసి భాధేసింది. మన పార్ట్‌నర్‌కి రక్షణగా ఉండాలనే ఫీలింగ్ మనకు ఉంటుంది. అయితే అది వాళ్లని కంట్రోల్ చేసేలా ఉండకూడదు. వాళ్ల కలలకు, సంతోషాలకు రక్షణగా నిలబడాలి. మనకు పుట్టటం, చావటంలో చాయిస్ ఉండదు. కానీ మధ్యలో జరిగే విషయాల్లో చాయిస్ ఉంటుంది. అదే మన భవిష్యత్‌ను మారుస్తుంది. సినిమా చూసిన మనకే ఇలా ఉంటే అలాంటి సిట్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్లకు ఇంకెంత ఎమోషన్‌గా ఉంటుందోననిపించింది’’ అన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘రషిలో తెలియని అమాయకత్వం ఉంది. ఆమెను నేను గీత గోవిందం నుంచి చూస్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటుంది. అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ ఎంచుకునే వరకు వచ్చింది. తన జర్నీ చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. నన్నెవడైనా కెలికితే రివర్స్‌లో వెళ్తా.. కానీ తను అలా కాదు.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంటుంది. దయతో ఉంటుంది. ఈ ప్రపంచం నన్ను మార్చకూడదు అని అనుకుంటుంది..రషి నువ్వు నిజంగా అమేజింగ్ ఉమెన్’’ అన్నారు.రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రధారులుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ . సినిమా నవంబర్ 7న విడుదలైంది. ఇప్పటికే సినిమా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి సినిమాను నిర్మించారు.