రోడ్డు పక్కన బజ్జీలు బోండాలు అమ్ముకునే వాళ్ళు మీద కమిషనర్ ప్రతాపం
పయనించే సూర్యుడు నవంబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన బజ్జీలు బోండాలు అమ్ముకునే వాళ్లపైన ప్రతాపం చూపిస్తున్న మున్సిపల్ కమిషనర్ బడా షాపుల వైపు కన్నెత్తి చూడని కమిషనర్
సూళ్లూరుపేట రాకెట్ టౌన్ ఈ పేరులో ఉన్న నిశ్శబ్దం ప్రశాంతత ఉనికి ఇవేవీ నిజంగా ఊర్లో అడుగుపె డితే కనబడుటలేదు విన బడినంతగా… అవును మీరు వింటున్నది నిజమే సూళ్లూరుపేట పట్టణంలో ఈ మధ్యకాలంలో తరచూ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకుల నుంచి అధికారులు దాకా అందరూ ఒకటే మాట ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొడదాం. ఇంతకీ ఈ ప్లాస్టిక్ ఎక్కడినుంచి వస్తుంది దీనిమీద జిఎస్టి వసూలు చేస్తున్న కేంద్రం నుంచి రాష్ట్రం దాకా అందరూ బాధ్యులే కానీ ప్లాస్టిక్ నిషేధం కొరకు వీరు చర్యలు చేపట్టేది కేవలం రోడ్డు పక్కన చిన్న బండి కొట్టల మీద చిల్లర వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల మీద వారిని పట్టుకోవడం వారికి జరిమానా విధించడం హాస్యాస్పదంగా ఉన్నది సూళ్లూరుపేట అధికారుల తీరు ప్రజలు నవ్వుకుంటున్నారు అసలు రోడ్డు పక్కన అంగళ్లలో వారికి రోజు సంపాదనే 400 500 వస్తుంది ఆ సంపాదన కొరకు రోడ్డుమీద ఎండలో రోజంతా కూర్చుని ఉంటారు వీరి దగ్గర వీధి పన్ను కూడా వసూలు చేస్తున్నారు మరి వీరు పార్సల్ చేసే అమ్ముకోవాలంటే కవర్లు కావాలి. ఆ కవర్లను అమ్మే దుకాణాల మీద అధికారుల చూపు వెళ్ళదు సూళ్లూరుపేట పట్టణంలో గత నెల రోజులుగా ప్రజలు ఘోషిస్తున్నారు జీఎస్టీ తగ్గించాము పండుగ చేసుకోండి అని ప్రభుత్వం చెబుతున్నది కానీ ఏ దుకాణాలలో కూడా ప్రైస్ లిస్ట్ లేదు మరి చిల్లర దుకాణాలలో వారు చెప్పిన ధరకే కొనవలసి వస్తున్నది జిఎస్టి తగ్గింది కదా అని అడిగితే వారి సమాధానం తగ్గింది అని ఎవరు చెప్పారు ఏ వస్తువు మీద అని మరలా ప్రశ్నిస్తున్నారు కానీ ఆ దుకాణంలో ప్రైస్ లిస్ట్ ఉంటే ఈ పరిస్థితి ప్రజలకు ఎదురు కాదు కదా వీటి మీద చర్యలు తీసుకోలేక అధికారులు మౌనం సాధిస్తున్నారు వీరి మౌనం ప్రజలకు ఏమన్నా ఉపయోగమా అయ్యా పట్టణంలోని బాధ్యత కలిగిన అధికారులు మీరు కచ్చితంగా వీటన్నింటి మీద సరైన చర్యలు తీసుకోకుండా తాత్కాలిక చర్యలను తీసుకుంటూ చిన్న వ్యాపారస్తుల నోరు కొట్టడం అంత మంచిది కాదు దయచేసి దీర్ఘ కాలిక ప్రణాళిక ప్రకారం చర్యలు చిన్న పెద్ద తేడా లేకుండా తీసుకోవలసిన బాధ్యత ఈ సూళ్లూరుపేట పట్టణ ముఖ్యమంత్రివర్యులు (కమీషనర్) స్పందించాలని అలాగే పంచాయతీ కులాయి లో వచ్చే శుభ్రత లేని నీటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు స్పందించాలని లేని పక్షాన ప్రజలు మున్సిపల్ ఆఫీసు ముందుకు నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుపుకుంటున్నారు
