పయనించే సూర్యుడుD.23.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. మూడు తరాలుగా సాగులో ఉన్న పాత పట్టా భూములను రక్షించాలి CPI(ML) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి V ప్రభాకర్ డిమాండ్మూ డు తరాలుగా సాగులో ఉన్న పాతపట్టా భూములను రక్షించాలని, గత రెండు ప్రభుత్వాలు రెండు సార్లు పట్టాలు ఇచ్చిన సాగుదారుల పైన అటవీ అధికారుల అడ్డంకులు ఆపివేయాలని CPI(ML) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి V ప్రభాకర్ డిమాండ్చే శారు. పందిమడుగు చీమన్ పల్లి పాత పంచాయితీ పరిధి గ్రామాలలో గత మూడు తరాలుగా సాగు చేస్తున్న పేదలైన దళిత బీసీ వర్గాలకు చెందిన పేదలను అటవీ అధికారులు వేదించడం ఆపపాలని CPI(ML) మాస్ లైన్ సిరికొండ, ధర్పల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: సరికొండ మండలం పందిమడుగు చీమన్ పల్లి పాత పంచాయితీ పరిధి గ్రామాలలో గత మూడు తరాలుగా సాగు చేస్తున్న పేదలైన దళిత బీసీ వర్గాలకు చెందిన పేదలకు పాత పట్టా పాస్ బుక్కులు వచ్చినాయి,డిజిటల్ పాస్ బుక్ లు ఇచ్చారు. వాటికి ఇందిరా జల ప్రభ ( సి ఎల్ డి పీ) స్కీం కింద విధ్యుద్ధికరణ కల్పించి టీన్సపర్ మర్లు అంధిచి, తమ భూములను డెవలప్ చేసి బోరు బావులు వేసినటువంటి భూములలో నేడు అటవీశాఖ అధికారులు సాగుకు అడ్డుపడుతున్నారు. జెండాలు పాతి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇట్టి భూములలో గత మూడు తరాలుగా క్రాఫ్ లోన్స్ తీసుకొని జీవిస్తున్న భూముల పైన ఫారెస్ట్ అధికారుల కవ్వింపు చర్యలను వెంటనే నిలుపుదల చేయుటకై ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చీమన్పల్లి పందిమడుగు పాత గ్రామ పంచాయితీలు అయిన ఈ గ్రామాలు ఏర్పడ్డప్పటినుండి గత వంద సంవత్సరాలుగా దళితులు’ గిరిజనేతరులు గిరిజనులు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటూ తాతల తండ్రుల నుండి జీవిస్తున్నాం మాకు ప్రభుత్వo చేసిన2006 అటవీ హక్కుల చట్టం కూడా వర్తిస్తుందని విషయాన్ని తమరికి తెలియనిది కాదు. కాబట్టి పాత పట్టాలను దృష్టిలో ఉంచుకొని సా గును దృష్టిలో ఉంచుకొని ఇట్టి భూములపైన అటవీ అధికారుల యొక్క అడ్డంకులు సృష్టించడాన్ని నిలుపుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. నిరుపేదలైన మాకు న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాము. కార్యక్రమం లో P రామకృష్ణ రాష్ట్ర నాయకులు,R రమేష్
సిరికొండ – ధర్పల్లి సంయుక్త మండల కార్యదర్శి,S సురేష్ జిల్లా నాయకులు లు ప్రసంగించగా B బాబన్న ఆర్మూర్ డివిజన్ నాయకులు,R దామోదర్ఆ ర్మూర్ డివిజన్ నాయకులు,M సాయిరెడ్డి ఆర్మూర్ డివిజన్ నాయకులు,B సర్పంచ్ సాయిలు
మండల నాయకులు K ఆశీస్మం డల నాయకులు పాల్గొన్నారు.