PS Telugu News
Epaper

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీ

📅 14 Nov 2025 ⏱️ 4:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

భైంసా పట్టణంలోని గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైంసా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ యు.కాశీనాథ్,భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ.దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా భైంసా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ యు.కాశీనాథ్ మాట్లాడుతూ మధుమేహం వచ్చిన తర్వాత బాధపడే కంటే మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.అలాగే షుగర్ వ్యాధి తీవ్రత వల్ల కిడ్నీ జబ్బులు,గుండె,కంటి,నరాల మెదడు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని,ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఒక గంట వ్యాయామం చేసినట్లయితే బీపీ,షుగర్,గుండె పోట్లు వంటి వ్యాధులు దరిచేరవని తెలిపారు.భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరు ముందస్తు షుగర్ పరీక్షలు చేయించుకోవాలని,ఒత్తిడిని నియంత్రించుకోవాలని సూచించారు.అంతేకాకుండా సమతుల ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యం పైన శ్రద్ధ వహించినప్పుడే మధుమేహ వ్యాధిని నివారించవచ్చునని అన్నారు.గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మధుమేహం అనేది వ్యాధి కాదని అది ఒక హెచ్చరికగా భావించాలని తెలిపారు.అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచంలో రెండవ అతిపెద్ద వ్యాధిగా మధుమేహాన్ని గుర్తించిందని అన్నారు. భారతదేశాన్ని డయాబెటిస్ ముక్త దేశంగా తీర్చిదిద్దడానికి దేశవ్యాప్తంగా మధుమేహ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భైంసా పట్టణములో ప్రతి సంవత్సరం ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు.భైంసా పట్టణ సిఐ గోపీనాథ్ మాట్లాడుతూ ఆరోగ్యమైన జీవనశైలిని అవలంబిస్తే మధుమేహ వ్యాధి రాకుండా జాగ్రత్త వహించవచ్చునని తెలిపారు.ప్రజలకు మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్న గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ వైద్యులు డాక్టర్ మహిపాల్,మహాగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వాసిఫ్, ప్రముఖ పురోహితులు బబ్రు మహారాజ్,కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ్,అధ్యాపకులు రావుల హరిత,కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారు.

Scroll to Top