చిన్నారుల హక్కుల కోసం జిల్లా న్యాయ సేవల సంస్థ ప్రత్యేక కృషి
పయనించే సూర్యుడు, నవంబర్ 14( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
చిన్నారులకు సమాన హక్కులు కల్పించడం, వారికి రక్షణ మరియు అవసరమైన సహాయాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తోందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. పర్షరాములు తెలిపారు.శుక్రవారం తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ అప్‌గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. పుష్పలత ఆదేశాలతో, సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి పి. లక్ష్మణాచారి సమన్వయంలో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.పిల్లలు దేశ భవిష్యత్తు అని, వారి హక్కులు ప్రతి ఒక్కరు గౌరవించాలని పర్షరాములు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. మల్లేష్ యాదవ్, లోక్ అదాలత్ సభ్యులు/న్యాయవాదులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, కళాశాల ప్రధానోపాధ్యాయురాలు పి. రజని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.