PS Telugu News
Epaper

తన స్పీడుతో మళ్లీ ప్రేక్షకుల హృదయాలు దోచేస్తున్న శ్రియా శరణ్

📅 15 Nov 2025 ⏱️ 11:15 AM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా సీనియర్ హీరోయిన్లు తమ కెరీర్‌లో సహాయక పాత్రలకు పరిమితమవుతుంటారు. అయితే, నటి శ్రియా శరణ్ మాత్రం అందుకు భిన్నంగా వయసుతో నిమిత్తం లేకుండా తన గ్లామర్‌ను కొనసాగిస్తూనే సినిమాలలోనూ, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటున్నారు. ఒకవైపు సహాయక పాత్రలు పోషిస్తూనే, అవకాశం వచ్చినప్పుడల్లా వాణిజ్య చిత్రాలలోనూ కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమా ఎంపికలో మరింత సెలెక్టివ్‌గా మారినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం శ్రియా శరణ్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రొమాంటిక్ మూమెంట్స్‌తో పాటు గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే, తన గ్లామర్ ఇమేజ్‌ను పరిపూర్ణంగా కొనసాగిస్తున్నారు.

+

Scroll to Top