PS Telugu News
Epaper

హెచ్చరిక! 3 రోజులు చలి నుంచి అరికట్టండి—ప్రముఖ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

📅 15 Nov 2025 ⏱️ 11:39 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. చల్లటి గాలులు వీస్తున్నాయి. మళ్లీ ఉదయం 9 గంటలు దాటేవరకు చలి వదలడం లేదు. ఉదయం వేళలో పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా కోహిర్‌లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీలుగా నమోదైంది. గ్రామాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్‌ ఉందని అధికారులు చెప్పారు. కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి గాలులు వీయొచ్చని అన్నారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం 9 గంటల కంటే ముందుగా ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

Scroll to Top