PS Telugu News
Epaper

హెలికాప్టర్ దిగుతూ .. ఫ్యాన్ గాలికి కిందపడ్డ ఏం.పి (వీడియో చుడండి)

📅 06 Nov 2025 ⏱️ 10:46 AM 📝 వైరల్ న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :- ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది అందరినీ షాక్ కి గురిచేసింది. ఆ వీడియో ఒక సినిమాలోని సన్నివేశం లాంటిది. ప్రఖ్యాత కవి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి హెలికాప్టర్ నుండి దిగుతుండగా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్ నుంచి బలమైన గాలి వీచడంతో నేలపై కుప్పకూలిపోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్లు ఆపివేయడానికి ముందే గాలివాన పెరగడంతో, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి స్కార్ఫ్, బట్టలు గాలిలో రెపరెపలాడాయి. అతను తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కొన్ని సెకన్లలోనే నేలపై పడిపోయాడు. ఈ వీడియోలో ఇమ్రాన్ ప్రతాప్‌గఢి హెలికాప్టర్ నుంచి దిగి, భద్రతా సిబ్బంది, అతనితో పాటు వచ్చిన స్థానిక నాయకులతో కరచాలనం చేయడానికి సిద్ధమయ్యాడు. అకస్మాత్తుగా, హెలికాప్టర్ బ్లేడ్‌ల నుండి బలమైన గాలి వీచడంతో అతను తడబడ్డాడు. మరుసటి క్షణంలో అతను హెలిప్యాడ్ అంచున పడిపోతాడు. సమీపంలోని ప్రజలు అతన్ని రక్షించడానికి పరుగెత్తారని తెలుస్తోంది. అయితే, ఈ వీడియోను టీవీ9 ధృవీకరించలేదు. ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఆధారంగా మాత్రమే రూపొందించినది. అయితే, ఇమ్రాన్ ప్రతాప్‌గఢి హెలికాప్టర్ నుంచి దిగుతున్నప్పుడు తడబడి పడిపోయాడని వీడియోలో కనిపించింది. అయితే @MuddAzeem అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఆ పెద్దమనిషికి ఏదైనా జరిగిందా?” అని అడిగారు. మరికొందరు దానిని తేలికగా తీసుకుని హాస్యభరితమైన వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారుడు, “తుఫానుల గురించి మాట్లాడే కవి ఒక్క గాలి వీచినా తనను తాను నియంత్రించుకోలేకపోయాడు” అని రాశారు. మరొక వినియోగదారుడు, “హెలికాప్టర్ గాలి కూడా ఈరోజు కవితాత్మక మూడ్‌లో ఉంది” అని రాశారు.

Scroll to Top