PS Telugu News
Epaper

జీవనశైలిలో స్వల్ప మార్పులతో మధుమేహం నియంత్రణ… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

📅 15 Nov 2025 ⏱️ 3:31 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పయనించే సూర్యుడు నవంబర్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం:

మానవ జీవనశైలిలో స్వల్ప మార్పులతో మధుమేహం నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.కలెక్టరేట్ లో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మధుమేహం – ఆరోగ్యకరమైన జీవన శైలిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మధుమేహం సైలెంట్ కిల్లర్ లాంటిదని, దీని నుంచి చిన్న, చిన్న జాగ్రత్తలు పాటించి మనల్ని, మన సన్నిహితులను కాపాడుకోవచ్చని అన్నారు. షుగర్ ను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు, కిడ్ని ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని, షుగర్ శరీరంలో అన్ని అవయవాలను పాడు చేస్తుందని అన్నారు.ప్రతిరోజు కనీసం అరగంట సమయం నడకకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. షుగర్ నియంత్రణకు వైట్ రైస్ స్వీకరణ తగ్గించాలని, మన ఆహారంలో ఫ్రై ఐటెమ్స్ లేకుండా చూసుకోవాలని, మన పూర్వీకులు తినే రాగులు, జొన్నలు, చిరు ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని అన్నారు.
చిన్నపిల్లల్లో కూడా మధుమేహం వస్తుందని, పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడకుండా ఔట్ డోర్ గేమ్స్ ఎక్కువ ఆడాలని అన్నారు.దైనందిన జీవితలో మనం చేసే స్వల్ప మార్పులతో మన ఆరోగ్యం బాగు పడుతుందని, భవిష్యత్తులో డయాలసిస్, గుండె సంబంధిత చికిత్సలు చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. ప్రజలు రెగ్యులర్ గా షుగర్, బీపి చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు మాట్లాడుతూ మధుమేహం వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఖమ్మం జిల్లాలో 55 వేల 829 మంది షుగర్ పేషెంట్ లను గుర్తించి మందులు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నామని అన్నారు.*డిప్యూటీ డీఎంహెచ్ఓ చందు నాయక్ మాట్లాడుతూ మధుమేహం వచ్చిన 100 మందిలో 50 మంది నిర్దారణ కాకపోవడం, తగిన జాగ్రత్తలు మందులు వాడకపోవడం వల్ల తీవ్రంగా ఆరోగ్యం దెబ్బతింటున్నారని అన్నారు. మన ఆహార అలవాట్లు మార్చుకొని షుగర్ వ్యాధి నియంత్రించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి మండలంలో మధుమేహం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి రోజు ఉదయం కనీసం అరగంట సమయం వాకింగ్ చేయాలని, అన్నం తగ్గించాలని, చిరు ధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా స్వీకరించాలని అన్నారు.అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో జిల్లా కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకొని మహిళా మార్ట్ ద్వారా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆరోగ్యకరమైన సహజసిద్ధమైన ఉత్పత్తుల ప్రదర్శన స్టాల్ ను సందర్శించారు.అంతకుముందు ఎస్.ఆర్. గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లు ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.ఉదయం డయాబెటిస్ రోగులకు కలెక్టరేట్ లో వైద్య పరీక్షలు చేసి సంబంధిత డాక్టర్లచే మధుమేహం రాకుండా, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నియంత్రణ జాగ్రత్తలపై పూర్తిగా అవగాహన కల్పించారు.సమాచార శాఖ సాంస్కృతిక సారధి కళాకారులచే మధుమేహం, ఆరోగ్యకరమైన జీవన శైలిపై ఆట, పాటల ద్వారా వివరిస్తూ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ రాజశేఖర్, వైద్యాధికారులు డా. గణేష్, డా. సీతారాం, డా. వేణుగోపాల్, వైద్య కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, ఫ్యాకల్టీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top