విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఎండి సలీం
“సలీం కు శాలువాతో సన్మానం చేసిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి “
(పయనించే సూర్యుడు నవంబర్ 15 రాజేష్)
చిన్నమసాన్ పల్లి ups స్కూల్ లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ ఈరోజు రాయపోల్ మండలం గ్రామం చిన్నమాసాన్ పల్లి యుపిఎస్ స్కూల్లో విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన మంగోలుకు చెందిన ఎండి సలీం గారికి శాలువా తో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు మద్దూరి శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. మరియు
ఈ సందర్భంగా విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు అతనికి తోచిన సహాయం చేయడం ఎంతో గర్వకారణం అని అందుకు సహకరించిన ఉపాధ్యాయురాలు కళ్యాణి గారి చొరవతో తన స్నేహితుడు ఆగు మంగోలుకు చెందిన ఎండి సలీం నీ కోరగా దాంతో అతడు ఆమె కోరిక మేరకు విద్యార్థుల చదువుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో అందుకు కళ్యాణి గారిని కూడా అభినందించారు.అలాగే విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుందేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో MD సలీం లింగారెడ్డిపల్లి కర్నాకర్ రాయపోల్ మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు మరియు చిన్నమాసన్ పల్లి ప్రధానోపాధ్యాయులు మద్దూరి శ్రీకాంత్,ఉపాధ్యాయురాలు కళ్యాణి, CRP ఎల్లా గౌడ్ , సొక్కం స్వామి తదితరులు పాల్గొన్నారు.
