PS Telugu News
Epaper

విద్యాభివృద్ధి లక్ష్యంగా ముందుకుఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

📅 15 Nov 2025 ⏱️ 5:31 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article


పయనించే సూర్యుడు నవంబర్ 16 నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.

విద్యాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు. బైంసా మండలంలోని వానలుపాడ్ గ్రామంలో జడ్పీ హైస్కూల్లో ఉపాధి హామీ నిధులు 12 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి తాను నిధులు ఇవ్వడానికి సిద్ధమేనని, సంఖ్యను పెంచాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతామని, మరింత మెరుగైన విద్యను ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. తాను ఒక రైతు బిడ్డనేనని ఈ స్థాయికి రావడానికి విద్యనేనని, తల్లిదండ్రులను, గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దని అన్నారు. ఈ సందర్భంగా వానల్ పాడ్ గ్రామస్తులు పలు సమస్యలను విన్నవించగా, దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావ్ పటేల్ , తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో నీరజ్, ఎంపీఓ జాదవ్ ప్రదీప్, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, గౌర శ్రీనివాస్, గణేష్ పటేల్, బైంసా మండల బిజెపి అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, స్థానిక నాయకులు చందర్ పటేల్, సాయ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ గంగాధర్, మాజీ సర్పంచులు రాము, ముత్యం రెడ్డి, ఆయా గ్రామాల బిజెపి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top