కొత్త కలెక్టర్‌గా నటించి ప్రజలను మోసగించిన మహిళ.. పట్టుబడిందా?
పయనించే సూర్యుడు న్యూస్ :ఐపీఎస్ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా ఎంత కంపిటిషన్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఉద్యోగాలు సాధించడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ వీటిని సాధించడం కష్టం. అహర్నిశలు శ్రమిస్తే తప్పా ఈ ఉద్యోగాలు రావు. వీటి కోసం ఏళ్లకేళ్లు ప్రయత్నిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఓ మహిళ వన్ డేలో కలెక్టర్ అయింది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఎన్నిస్లారు ప్రయత్నించిన ఉద్యోగం రాకపోవడంతో ఎవరు కలలో కూడా ఊహించని ప్లాన్ వేసింది. తనకు కలెక్టర్‌గా ఉద్యోగంవచ్చిందంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ మేరకు నకిలీ ఉత్తర్వులను కూడా తయారు చేసింది. అక్కడితో ఆగకుండా వాటిని తీసుకొని, నేరుగా కలెక్టరేట్ కు వెళ్లింది. కలెక్టరేట్ లో కూడా తన తన ఛాంబర్ ఎక్కడ అంటూ హల్చల్ చేసింది. కానీ అక్కడ ఉన్న వారికి ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది.వివరాల్లో వెళ్లితే.. కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ కొత్తగా ఇంచార్జ్ కలెక్టర్ గా వచ్చినని, నానా హంగామా చేసింది. వెంటనే తన దగ్గర ఉన్న డామ్మీ ఉత్తర్వులను సిబ్బందికి చూపించింది. అక్కడినుంచి కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి ఐఏఎస్ నంటూ అందరితో పరిచయం చేసుకుంది. ఇప్పటి వరకు తాను సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో కమిషనర్‌గా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించే పని చేసింది. 4వ తేదీ నుంచి తనను ఆశిష్ సాంగ్వాన్ స్థానంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని తెలిపింది. ఈమె ప్రవర్తనలో ఎక్కడో తేడాను గమనించిన స్థానిక అధికారులు ఆ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు పంపించారు. అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆ ఉత్తర్వుల ప్రతిని పరిశీలించడానికి పరిపాలన శాఖకు పంపించిన కంఫార్మ్ చేసుకుంటామని చెప్పారు. దీంతో తన భండారం బయట పడుతుందని గమనించిన ఆమె వెంటనే కలెక్టర్ ఛాంబర్ నుంచి జరుకొని, కారలో వెళ్లిపోయింది. ఆమె కనిపించపోవడంతో అదనపు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట చేయగా, కుటుంబసభ్యులను ఉద్యోగం వచ్చిందని నమ్మించడం కోసం ఇలా చేసినట్లు ఒప్పుకుంటుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఆమె పంపించారు.