PS Telugu News
Epaper

బీజేఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో యాంటీ–రాగింగ్ అవగాహన కార్యక్రమం

📅 15 Nov 2025 ⏱️ 6:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, నవంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్

బీజేఆర్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్లలో యాంటీ–రాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, అలాగే కళాశాలలో సురక్షితమైన మరియు గౌరవప్రదమైన వాతావరణం ఏర్పరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.కార్యక్రమాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఓ ఐ ఎస్ ఏ సమన్వయకర్త ఎల్. రాజా ప్రసంగంతో ప్రారంభించారు. ఆయన రాగింగ్ అంటే ఏమిటి, అది విద్యార్థుల భవిష్యత్తుపై చూపే ప్రభావం, ఇటువంటి చర్యలు ఎందుకు అనర్హమో విద్యార్థులకు వివరించారు.
అసోసియేట్ డీన్ సునీతా దేవి రాగింగ్ నిర్వచనం, చట్టపరమైన శిక్షలు, అలాగే కళాశాలలో యాంటీ–రాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న చర్యలను వివరించారు. యు జి సి మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.సిరిసిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మోగిలి రాగింగ్‌కు సంబంధించిన చట్టపరమైన పరిణామాలు — ఎఫ్ఐఆర్ నమోదులు, క్రిమినల్ కేసులు, సస్పెన్షన్, జైలు శిక్ష వంటి అంశాలను వివరించారు. విద్యార్థులు పరస్పరం గౌరవం పాటించాలని సందేశమిచ్చారు.తంగళ్ళపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ చారి నేటి యువతలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్‌బుల్లీయింగ్, ఆన్‌లైన్ వేధింపులు, ఐడెంటిటీ దోపిడీ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలను వివరించి, విద్యార్థులు జాగ్రత్తగా ఆన్‌లైన్ వాడకం చేయాలని సూచించారు.కార్యక్రమం చివర్లో విద్యార్థులు, అధ్యాపకులు అందరూ యాంటీ–రాగింగ్ ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Scroll to Top