PS Telugu News
Epaper

నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్

📅 17 Nov 2025 ⏱️ 2:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్ననంద్యాల

స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో, నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. దళారుల వ్యవస్థను తొలగించి, పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్.ఎమ్.డి. ఫయాజ్ , చాబోలు ఇలియాస్ ,బద్రి శెట్టి రవి, రంగ ప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయ గౌరీ, కాల్వ శీను, ధనుంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్, మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు, మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top