వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై స్పందించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం
మున్సిపల్ కమిషనర్‌కు సూచనలు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ నవంబర్ 17
నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో శనివారం 15 వ తేదీన నిర్వహించిన *‘ *జాడు చలావ్ యాత్ర’** లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్‌తో కూడిన పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి మౌలిక వసతుల లోపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. కాలనీలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ లేమి, చెత్త సేకరణ లోపాలు, వరద నీటి ముంపు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆప్ నాయకులకు వివరించారు. మురుగునీరు నిల్వ కారణంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు విస్తరిస్తుండగా, ఇప్పటికే సుమారు 20 మంది నివాసితులు ఈ రోగాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ అంశాలను ఆప్ నాయకులు ప్రజావాణి ద్వారా అధికారులు దృష్టికి తీసుకెళ్లగా, జెసి గారు వెంటనే స్పందించి, వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జనరల్ సెక్రెటరీ సిహెచ్ వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ట్రెజరీ అబ్దుల్ సాదిక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వసంతరావు పాల్గొన్నారు
