బీరంగూడ మల్లికార్జున హిల్స్‌లో ఘనంగా 14వ మహా పడిపూజ*
జనం న్యూస్ నవంబర్ 17
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బీరంగూడ మల్లికార్జున హిల్స్‌లో నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 14వ మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించారు. కన్నె స్వామి నందారం భరత్ గౌడ్, సందీప్ గౌడ్ సాన్నిధ్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా, అయ్యప్ప భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణాన్ని నిండా పూరించారు.కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి గంగాపుత్ర నర్సింగ్ రావు వారి బృందం ఆలపించిన భక్తిరస గానాలు భక్తులను మైమరిపించాయి.అనంతరం నిర్వహించిన మహా పడిపూజలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమానికి పలు పార్టీల రాజకీయ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు, అయ్యప్ప మాలధారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
