PS Telugu News
Epaper

బస్సు సమస్యపై డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పణ

📅 17 Nov 2025 ⏱️ 3:36 PM 📝 HOME
Listen to this article

. జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా.

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నుంచి రాజంపేట రైల్వే స్టేషన్ వైపు విద్యార్థులుఉద్యోగులు,వ్యాపార వేత్తలు,సాధారణ ప్రజలు రోజూ ప్రయాణించే ఆర్టీసీ బస్ సర్వీ సులను పునరుద్ధ రించాలని కోరుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ మాధవి లత కి వినతి పత్రం అందజేశారు. గతంలో నందలూరు – రాజంపేట మధ్య నడిచిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపి వేయ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యా ర్థులు కళాశాలలకు వెళ్ల డానికి,ఉద్యోగులు విధులకు చేరుకోవడానికి,వృద్ధులు మరియు మహిళలు అత్యవసర సేవల కోసం ప్రయాణించే సందర్భాల్లో ప్రత్యా మ్నాయ వాహనాలు లేక ఇబ్బం దులు పడు తున్నట్లు వినతి పత్రంలో వివరించారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ప్రైవేటు వాహన ప్రయాణం భారం అయ్యిం దని,తోగురపేట,పాటూరు,నాగిరెడ్డిపల్లి నుండి విద్యార్థులు కాలేజీ మరియు స్కూలుకు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని. ఈ మార్గంలో బస్సు పునరుద్ధరణ అత్యవసర మని తెలిపారు.వినతి పత్రాన్ని స్వీకరించిన డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. సమస్యపై వీలైనంత త్వరగా బస్సు సర్వీసులను పునః ప్రారంభం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు రాచూరి మురళి,వీరబల్లి జయకుమార్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు,జనం న్యూస్ పత్రిక విలేఖరి కిరణ్ పాల్గొన్నారు.

Scroll to Top