PS Telugu News
Epaper

సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

📅 06 Nov 2025 ⏱️ 5:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు “

(పయనించే సూర్యుడు నవంబర్ 6 రాజేష్)

ఈ రోజు శ్రీ సత్యసాయి సేవాసమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానోపాధ్యాయులు చామకూర అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలో ఐదు తరగతులకు గాను ఐదు బృందాలుగా విద్యార్థులు పాల్గొన్నారు వశిష్ట, భరద్వాజ, ద్రోణాచార్య,అగస్త్య, భరద్వాజ ఐదు బృందాలుగా విద్యార్థులను విభజించి క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది ఈ పోటీలో వశిష్ట బృందం విద్యార్థులు వివేకానంద అభిలాష్ రోహిత్ సాయి కృష్ణ అజాం మొదటి బహుమతి సాధించడం జరిగిందని అన్నారు గెలుపొందిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ గోవర్ధన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంజీవ గౌడ్ విష్ణు కుమార్ హరికృష్ణ మల్లేశం పాల్గొన్నారు.

Scroll to Top