PS Telugu News
Epaper

పది’ ఫీజులో ప్రైవేట్ దందా..రూ.125 ఫీజుకు రూ. వెయ్యి వసూలు….ప్రైవేటు పాఠశాలల నిర్వాకం..కొరవడిన విద్యాశాఖ పర్యవేక్షణ

📅 17 Nov 2025 ⏱️ 5:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

…పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

కలివెలుగుల చక్రపాణి.___యుఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భైంసా మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా నామత్కర్ నవీన్ మాట్లాడుతూ: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా రాబడుతున్నాయి.పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజును ఈ నెల వరకు చెల్లించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని ప్రవేట్ పాఠ శాలలు విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రైవేటు పాఠ శాలలు ఉండగా అందులో కొన్నివేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రత్యేక తరగతుల పేరిట పదో తరగతి చదివే విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు రూ.125 చెల్లించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొం ది. అయితే ప్రైవేటు స్కూళ్లు మాత్రం రూ.2000 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజుపై తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తే వచ్చే పరీక్షల్లో తమ పిల్లలకు ఇబ్బందులు తప్పవని భావించి అడి గినంత చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు అందిన కాడికి దండుకుంటున్నా యనే ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా ప్రత్యేక తరగతులు, రోజువారీ స్లిప్ టెస్ట్లు, గైడ్స్ వంటి వాటి పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నా యి. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము…. ఈ కార్యక్రమంలో స్వాతి, రాజేశ్వరి, అజయ్, సాయి, శివాజీ, కార్తీక్, పాండురంగ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top