PS Telugu News
Epaper

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులకు టిసిఎస్ బహుమతులు.

📅 17 Nov 2025 ⏱️ 7:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్17 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి:టి.సి.ఎస్. నిర్వహించిన వ్యాసరచన పోటీలలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. సోమవారం స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు టి.సి.ఎస్.కంపెనీ ప్రతినిధులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.సీనియర్స్ విభాగంలో రూప దీపిక, లలిత, కీర్తన లు, జూనియర్స్ విభాగంలో ప్రణతి, నసీర్ బాబా, మోక్షిత లు మొదటి, రెండవ, మూడవ బహుమతులు గెలుపొందారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ అయేషా మాట్లాడుతూ స్టార్ పారడైజ్ హై స్కూల్ విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలలో రాణిస్తుండడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన టి.సి.ఎస్.కంపెనీ ప్రతినిదులు సురేష్, హరి లకు పాఠశాల మేనేజ్ మెంట్ నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Scroll to Top