అగాపే ఆశ్రమ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్ర పరిధిలోని, కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.డాక్టర్ మధుసూదన్ రాజు గారు, సతీమణి డాక్టర్ సునీత గారు వీరు ఇద్దరు కలిసి అగాపే ఆశ్రమ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్నవారే కాక బయట వారికి కూడా ఇంచుమించు 100మందికి కంటి పరీక్షలు చేశారు.అంతేకాకుండా 80 మందికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది.అంతేకాకుండా పదిమందికి ఉచిత ఆపరేషన్లు కూడా జరిగేందుకు రిఫర్ చేశారు. ఆశ్రమం ఫౌండర్ బత్తుల ప్రసాద్ గారు, సతీమణి ఏమిమా గారు భాష గారు వారు కూడా వారికి సహకరించి, వచ్చిన వారందరినీ కూడా ప్రోత్సహించారు. ఆశ్రమంలో వారితోపాటు, వచ్చిన వారంతా కూడా ఉచితముగా కంటికి పరీక్షలు నిర్వహించినందుకు సంతోషించారు.
