PS Telugu News
Epaper

జాతీయ “బీసీ జనసేన”కు గ్రీన్ సిగ్నల్

📅 17 Nov 2025 ⏱️ 7:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడిగా కత్తి చంద్రశేఖరప్ప

బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ

బీసీ హక్కుల కోసం నూతన ఉద్యమ ప్రారంభం

( పయనించే సూర్యుడు నవంబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

షాద్ నగర్ నియోజకవర్గ “బీసీ జనసేన” ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. బీసీ జనసేన ఏర్పాటు కోసం జాతీయ అధ్యక్షుడిగా పేరును బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షాద్ నగర్ కు చెందిన బీసీ నేత కత్తి చంద్రశేఖర అప్పను బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకుల ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్‌లో జాతీయ బీసీ జనసేనను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. హైద్రాబాద్ విద్యానగర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మరియు బీసీ యువ నాయకుడు డా. అరుణ్ బాబు సంఘాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ జనసేన జాతీయ అధ్యక్షులుగా కె. చంద్రశేఖర్ ని నియమిస్తూ ఆర్. కృష్ణయ్య అనుమతి పత్రం అందజేశారు. ఈ నూతన వేదిక ద్వారా దేశవ్యాప్తంగా బీసీ వర్గాల సమస్యలు, హక్కులు, అవకాశాల కోసం ఒక బలమైన ఉద్యమం ప్రారంభమవుతున్నదని నాయకులు పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం, న్యాయపోరాటం కోసం నేను నిరంతరం శ్రమిస్తాను” అని నూతనంగా నియమితులైన జాతీయ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి చంద్రశేఖర్, జమాల్పూర్ చందూలాల్, గడ్డమీది రమేష్, జువ్వు సుధాకర్, తంగడపల్లి శంకర్, మేకల వెంకటేష్, జూపల్లి చంద్రశేఖర్, ఆవుల ఆంజనేయులు, తోట మహేందర్ జక్కుల జలజ, స్రవంతి మరియు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top