యువత గంజాయి, మాదపద్రవ్యాలకు దూరంగా ఉండాలి..
రుద్రూర్, నవంబర్ (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాలలో మంగళవారం ఎస్సై సాయన్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కల్పించారు. అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. యువకులు గంజాయి, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీసు సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.