పత్రికలు,చానళ్లు జర్నలిజం విలువలు కాపాడాలి
ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీకి అభినందనలు:మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 18 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
మీడియా రంగంలో నానాటికి సంభవిస్తున్న ఆధునిక నూతన టెక్నాలజీని అంది పుచ్చుకొని పత్రికలు చానళ్లు జర్నలిజం విలువలు పెంపొందించాలని, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీ సభ్యులు మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీకి అభినందనలు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు అందించిన సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ కు సహాయసహకారాలు అందిస్తానన్నారు తమ రేటింగ్ ల కొరకు వాస్తవ సమాచారాన్ని అవాస్తవాలుగా వక్రీకరించవద్దని,నిజాలను నిష్పక్షపాతంగా మీడియాలో ప్రతిబింబించేలా వార్తలు రాయాలని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాలని చెప్పారు. మీడియా రంగంలో వస్తున్న నూతన వరవడి ప్రకారం జర్నలిస్టులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు.ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు నాయిని శ్రీనివాసరావు ను సన్మానించారు నూతన కమిటీ లో పదవులు పొందినవారు ఎల్లప్పుడూ తమకు అందించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేయాలని అభిలాషించారు.
