PS Telugu News
Epaper

అడవిలో ఉద్రిక్తం: కీలక మావోయిస్ట్ నాయకులు ఎన్‌కౌంటర్‌లో మృతి!

📅 19 Nov 2025 ⏱️ 11:57 AM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే మరోసారి ఎదురుకాల్పలు జరిగినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ధృవీకరించారు. అల్లూరి జిల్లా జి.ఎం.వలస సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు అజాద్, దేవ్‌జీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ లడ్డా తెలిపారు.కొన్నాళ్లుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మా.. మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లో​ని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో హిడ్మా భార్య రాజక్క తోపాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటన మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే మరోసారి ఎదురుకాల్పలు జరిగినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ధృవీకరించారు. అల్లూరి జిల్లా జి.ఎం.వలస సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు అజాద్, దేవ్‌జీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ లడ్డా తెలిపారు. మంగళవారం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని లడ్డా తెలిపారు. వారిని పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిపారు.


Scroll to Top