PS Telugu News
Epaper

పుట్టపర్తి సందర్శనలో మోదీ: సత్యసాయిబాబా సిద్ధాంతాలపై ప్రశంసలు

📅 19 Nov 2025 ⏱️ 3:31 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి బాబా బోధనలు నేటికీ ఆదర్శమన్నారు. సత్యసాయి హిరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తిని పవిత్ర భూమిగా అభివర్ణించారు.సత్యసాయి బాబా ఆశీర్వాదం తీసుకునేందుకు తప్పకుండా పుట్టపర్తికి వచ్చేవాళ్లమన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’ అనే బాబా సందేశాన్ని పాటించడంతోపాటు సత్యసాయి ట్రస్టు చేస్తున్న పనులను అభినందించారు.  అనంతరం సత్యసాయి ట్రస్ట్ ద్వారా జరుగుతున్న మానవ సేవ, విద్య, ఆరోగ్య కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపులను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఎందరో మహానుభావులు, అందరకీ వందనములు అన్నారు. సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టమన్నారు.



Scroll to Top