PS Telugu News
Epaper

గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏండ్ల జైలు శిక్ష….. ఒక్కొక్కరికి లక్ష జరిమానా

📅 19 Nov 2025 ⏱️ 4:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు

ప్రాసిక్యూషన్ కు సహకరించిన అధికారులను అభినంధిచిన పోలీస్ కమిషనర్

పయనించే సూర్యుడు నవంబర్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జరిమాన విధిస్తూ.. మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి గారు తీర్పు వెల్లడించారు.ప్రాసిక్యూషన్ కు సహకరించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్…ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం.. జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జన కోసం సీలేరు నుండి తీసుకొచ్చిన గంజాయి కొణిజర్ల మండలం, గద్దలగూడెం గ్రామ శివారులోని పొలాలలో నిలువచేసి 2020 డిసెంబర్ 4 న సుమారు 50 కేజీల గంజాయిని ఇతర ప్రాంతాలకు ఆటోలో తరలిస్తున్న క్రమంలో కొణిజర్ల పోలీసులకు ఇద్దరు నిందుతులు 1) తమ్మిశెట్టి ఆనంద్ 29సం, (తళ్లాడ గ్రామం గద్దలగూడెం, కొణిజర్ల మండలం.) 2) గుగులోతు బావసింగ్ @ శంకర్ (కొమ్ముగూడెం గ్రామం జూలూరుపాడ్ మండలం) పట్టుపడ్డారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులపై మోపిన అభియోగం రుజువు కావటంతో పైవిధంగా తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ కు సహకరించిన
విచారణ అధికారలు అప్పటి ఇన్స్పెక్టర్ వసంత కుమార్, ప్రస్తుత ఇన్స్పెక్టర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,జె. శరత్ కుమార్ రెడ్డి, ఎస్సై మొగిలి, కోర్టు కానిస్టేబుల్ రామారావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్ ఎస్సై హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున రావు, శ్రీనివాస్,నాగేశ్వరారావు, హోంగార్డ్ ఆఫీసర్ ఎండీ.ఆయూబ్ ప్రాసిక్యూషన్ కు సహకరించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్…

Scroll to Top