PS Telugu News
Epaper

వరి పంటను పరిశీలించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

📅 19 Nov 2025 ⏱️ 7:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ పర్యటనలో భాగంగా మండల పరిధిలోని వరి పంటను రైతులతో కలిసి పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ . అనంతరం వరి పంట సాగు, దిగుబడి, మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తి, నీటి సదుపాయం, మార్కెటింగ్, మరియు ఇతర అంశాలకు సంబంధించి రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. “రైతులే దేశానికి వెన్నెముక. వారి కష్టం ఎంతో గొప్పదని. రైతులు తెలియజేసిన సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటిని త్వరలోనే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని” ఆయన హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు సదాశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారావు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top