PS Telugu News
Epaper

అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్” రెండవ విడత నిధుల పంపిణీ కార్యక్రమము.

📅 19 Nov 2025 ⏱️ 7:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 19,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

గోస్పాడు మండలంలో అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కార్తీక్. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పి.ఎం. కిసాన్ పథకం ద్వారా 20,000/- రూపాయలు అందిస్తుందని, ఇందులో భాగంగా గత ఆగష్టు నెలలో మొదటి విడతగా 7000/-రూపాయలు జమ చేయడం జరిగిందని, ఈ రోజు రెండవ విడతగా 7000/- రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయటం జరుగుతుంది అని తెలిపారు. ఈ నగదు రైతులు వారి వ్యవసాయ ఖర్చులకు ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు ద్వారా పంటలు సాగు చేయాలనీ, అందుకు గాను ప్రభుత్వ సూచనలు పాటించాలని, అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంభించి నాణ్యమైన దిగుబడులు పొందగలరని తెలిపారు, అలాగే ప్రభుత్వ సంక్షేమానికి చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ రైతులు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా పొందే సొమ్మును వ్యవసాయ అవసరాలకు ఉపయోగించ కోవాలని, అలాగే అర్హత కలిగిన రైతులందరకీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, NPCI మరే ఇతర సమస్యలున్న సంబంధిత రైతుసేవాకేంద్రాలను సంప్రదించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో DDA మద్దిలేటి, ADA, జయప్రకాష్,రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి , మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, నంద్యాల మరియు గోస్పాడు వ్యవసాధికారులు ప్రసాదరావు ,స్వప్నిక రెడ్డి, మండల అధికారులు, రైతులు పెద్ద ఎత్తున ,పాల్గొన్నారు.

Scroll to Top