మధురాపూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం
పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి
( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మధురపూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఈరోజు బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు బాల్యవివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లల చదువుల గురించి విద్యార్థులకు ప్రత్యేకించి వివరించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి మరియు పాఠశాల హెచ్ఎం సునీత మరియు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ వనజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
