క్షయ నిర్మూలన గర్భిణీ సేవల బలోపేతంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్
పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గఆకస్మిక సందర్శన చేశారు ఈ సందర్భంగా ఇంజక్షన్ గదిని ఫార్మసీ స్టోర్ ని రక్త పరీక్షల గదిని, టీకాల నిల్వ గదిని,కాన్పుల గదిని ఇన్ పేషెంట్ వార్డ్ ని పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలను ఇవ్వడం జరిగింది క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించడానికి క్షేత్రస్థాయిలోని సిబ్బంది సరైన చర్యలు తీసుకొని వ్యాధిగ్రస్తులను త్వరితగతిన గుర్తించడానికి పరీక్ష నిమిత్తం అనుమానితుల నుండి తెమడ నమూనాల సేకరణ సంఖ్యను మరింత పెంచాలని తద్వారా వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి సకాలంలో చికిత్సను అందించడం ద్వారా క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు, టీ హబ్ ద్వారా చేసే రక్త పరీక్షల సంఖ్యను పెంచాలని ఆదేశించారు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను మరింత మెరుగుపరుచుకోవాలని, గర్భిణీ స్త్రీలను త్వరితగతిన గుర్తించి వారికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలను సకాలంలో అందించాలని, హై రిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి సుఖ ప్రసవం అయ్యేంతవరకు నిరంతర సేవలందించాలని ఆదేశించారు.అలాగే ఆరోగ్య శాఖ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో మరింత కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కందుల దినేష్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుందర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ,పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ ఆరోగ్య విస్తరణాధికారి దేవా సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్లు ధర్మపురి రవికుమార్ కిరణ్ కుమారి ల్యాబ్ టెక్నీషియన్ రాజు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.