ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో షాద్ నగర్ చౌరస్తాలో నిరసన
( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 8500 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ… విద్యార్థులకు గత ఆరు సంవత్సరాల నుండి స్కాలర్షిప్ పీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం సిగ్గుచేటు… గత నాలుగు రోజులుగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మరియు ఇంజనీరింగ్ కాలేజీలు స్వచ్ఛందంగా బంధు చేసుకొని ఉన్న కనీసం ప్రభుత్వం వారితో చర్చలు జరుపకపోవడం బాధాకరం… ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కాలేజీ యజమాన్యాలతో చర్చలు జరిపాలని వారు అన్నారు లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిల్,సాయి,బన్నీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు..