విశ్వహిందూపరిషత్-భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు మల్దకల్ మండల జూనియర్ కళాశాల లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 20 2025 రిపోర్టర్ కిష్టన్న గద్వాల్ జిల్లా
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మల్దకల్ ఎస్.ఐ నందికర్ మాట్లాడుతూ నేడు డ్రగ్స్ విషయం లో ప్రధానంగా టార్గెట్ చేయబడుతుంది యువత మరియు విద్యార్థులేనని ప్రతి ఒక్క విద్యార్థి డ్రగ్స్ నివారణ పై అవగాహన ఉండాలని ఎక్కడైనా ఎవరైనా గంజాయి కానీ ఏ ఇతర డ్రగ్స్ అయినా కానీ అమ్ముతూ ఉన్న కొంటూ ఉన్న సమాచారాన్ని పోలీసులకు నేరుగా కానీ కళాశాల యాజమాన్యం ద్వారా తెలపాలని సూచించి టోల్ ఫ్రీ నంబర్ ను ఇవ్వడం జరిగింది…వి.హెచ్.పీ జిల్లా అధ్యక్షలు ఫణిమొహన్ రావ్, కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహులు లెక్చరర్ రామాంజనేయులు గౌడ్, వి.హెచ్.పీ రవి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ విషయం లో దూరంగా ఉండాలని డ్రగ్స్ వల్ల జీవితాలని నాశనం చేసుకోవద్దని డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని డ్రగ్స్ నివారణ లో విద్యార్థులు,యువత కీలక పాత్ర పోషిస్తేనే ఇది సాధ్యమని తెలపడం జరిగింది.. అలాగే డ్రగ్స్ నివారణ పోస్టర్స్ రిలీజ్ చేయటం జరిగింది.