బూరుగడ్డ తండకు మంచినీటి సరఫరా ప్రారంభం
( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండ పరిధిలోని బూరుగడ్డ తండాలోని అంజనేయ స్వామి గుడి, శివాలయం వద్ద గ్రామ మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ తన సొంత ఖర్చులతో నిర్మించిన బోరు బావి నుండి మంచినీటి సరఫరాను పైప్లైన్ ద్వారా తండకు మంచినీటి అవసరాల కోసం పైప్లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో తండకు అవసరమయ్యే నీటిని సరఫరా చేయడం జరుగుతుందని దీంతో తండా ప్రజల యొక్క మంచి నీటి అవసరాలు తీరుతాయని గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ జంగయ్య మరియు మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మరియు రాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు .