“రేర్ మోమెంట్‌ను రాజకీయ వేదికగా మార్చిన అమిత్ షా? చర్చలు హాట్!”
పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 31, 2026.. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఎండ్‌కార్డ్ పడాల్సిన రోజు. ఆ తర్వాత నక్సలిజం అనే శబ్దమే నిషిద్ధం. కేంద్ర హోంమంత్రి జారీ చేసిన హుకుం ఇది..! మహా అయితే నాలుగు నెలలే గ్యాప్ ఉంది. మరి, లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం.. నాకిప్పుడే తెలియాలి అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. అందుకోసం అనఫీషియల్‌గా ఓ స్పెషల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు అనిపించింది.సందర్భం బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌కు పదోసారి పట్టాభిషేకం.. వేదికపై ఎన్‌డీఏకి చెందిన మహామహులు.. ఇంక్లూడింగ్ హోంమంత్రి అమిత్‌షా. కానీ, ఇదే సిట్యువేషన్ మరో కాజ్ కోసం ఉపయోగపడింది. సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అమిత్‌షా.. ఆయన పక్కనే ఏపీ సీఎం చంద్రబాబు. ఇద్దరూ దాదాపు పదినిమిషాల సేపు సీరియస్‌గా మంతనాలు జరపపడ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఆ వెంటనే అటుగా వెళ్తున్న చత్తీస్‌ఘడ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మను పిలిచి మరీ పక్కనే కూర్చోబెట్టుకుని.. ఆయన చెవిలో కూడా ఏదో సీరియస్‌గా చెప్పారు. డీటెయిల్స్ అడిగి తీసుకున్నారు అమిత్‌షా. తన మొబైల్‌ఫోన్‌లో కూడా ఏదో మెసేజ్‌ని కూడా చూపించారు విజయ్ శర్మ. కట్‌చేస్తే.. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంధ్రప్రధాన్ వంతు. ఈయన ఒడిషాకు చెందిన కీలక నేత. వెనక సీట్లో ఉన్న ధర్మేంధ్రను మందుకులాగి మరీ, ఇంటిమేట్‌గా మాట్లాడారు హోంమంత్రి అమిత్‌షా.ఈ మూడు సీన్లనూ కలిపి చూస్తే ఒక కామన్ కనెక్షన్ కనిపిస్తుంది. ఏంటంటే.. ముగ్గురు సీనియర్ లీడర్లూ నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు చెందినవారే. ఆపరేషన్ కగార్ దాదాపు క్లైమాక్స్ స్టేజ్‌కి చేరుకుంది. ఎలిమినేషన్ రౌండ్ నడుస్తోంది. వరుస ఎన్‌కౌంటర్లతో నక్సల్ ఏరివేత జోరుగా సాగుతోంది. ఏపీలోని మారేడుమిల్లిలో భీకర ఎన్‌కౌంటర్లు జరిపి హిడ్మా, టెక్ శంకర్ లాంటి మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టులను నిర్మూలిస్తూ వస్తున్నాయి భద్రతాబలగాలు. వాట్ నెక్ట్స్ అని సోచాయిస్తోంది హోంమంత్రిత్వ శాఖ. ఈ నేపథ్యంలోనే పాట్నాలో నితీష్ పట్టాభిషేక మహోత్సవంలో నక్సల్ పీడిత రాష్ట్రాల నేతలందరూ కొలువుదీరడం.. అమిత్‌షాకు కలిసొచ్చింది. వేదిక ఏదైనా టార్గెట్ అదే.. ఆపరేషన్ కగార్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌పైనే వీళ్లందరితో ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది.నక్సలిజాన్ని కూకటివేళ్లతో తెంచిపారేస్తాం అని ప్రతిజ్ఞ చేసిన అమిత్‌షా.. 2026 మార్చి 31ని డెడ్‌లైన్‌ని కూడా పెట్టుకున్నారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య పదేళ్లలో 128 నుంచి 18కి తగ్గిపోయాయి. కానీ, ఇటీవల లొంగుబాట్ల సంఖ్య మందగించడం, ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడం ఆసక్తికరంగా మారింది. కూంబింగ్ ముమ్మరం కావడంతో కకావికలమైన నక్సల్స్ ఏలూరు, కాకినాడ, విజయవాడ… ఇలా నగరాల్లో షెల్టర్ తీసుకుంటున్నారు. వాళ్ల ఏరివేత ఎలా? నక్సలిజం నిర్మూలన పరిసమాప్తం కావాలంటే ఇంకా ఏమేం చెయ్యాలి అనే అంశాలపై అమిత్‌షా డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్‌రహిత రాష్ట్రంగా డిక్లేర్ చేసే రోజు ఎంతో దూరంలో లేదని ఏపీ డీజీపీ ప్రకటించారు. పైగా, త్వరలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల మీటింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే.. పాట్నాలో నితీష్ ప్రమాణస్వీకార వేదికపై అమిత్‌షా హంగామా చేశారా? అయినా, వార్‌రూమ్‌లోనో హాట్‌లైన్‌లోనో ఏకాంతంగా మాట్లాడాల్సిన మోస్ట్ కాన్ఫిడెన్షియల్ విషయాలను ఇలా ఓపెన్‌గా మాట్లాడుకున్నారా? నలుగురూ కలిసిన రేరెస్ట్ సిట్యువేషన్‌ని హోంమంత్రి ఈ విధంగా వాడేసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది.