PS Telugu News
Epaper

“సినిమా హిట్‌తరువాత మారిన పరిస్థితులపై కోలీవుడ్ స్టార్ వ్యాఖ్యలు”

📅 21 Nov 2025 ⏱️ 12:17 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కోలీవుడ్‌లో ఒకప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభలు, కథలు.. ఇవన్నీ ఒక్క సినిమా చుట్టూనే తిరిగేవి. కానీ 2011లో వచ్చిన ఒక సాంకేతిక మార్పు, ఒక చిన్న పాట సినిమా ఇండస్ట్రీ దశనే మార్చేసింది. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఇంకా తమ పటాళం పెంచుకునే దశలో ఉండగానే, ఒక సరదా ట్యూన్ దేశమంతా, ప్రపంచమంతా విస్తరించింది. ‘వై దిస్ కొలవెరి డీ’ – ఈ పాట పేరు వింటే నవ్వు రావడమే కాదు, ఆ టైమ్‌లో ప్రతి ఒక్కరి మొబైల్‌లో రింగ్‌టోన్‌గా మారింది. ఈ పాట తన కెరీర్‌కు ఆశీర్వాదమా, శాపమా అనే విషయాన్ని చెబుతూనే, దాని వెనుక ఉన్న అన్‌టోల్డ్ స్టోరీని బయటపెట్టారు ఆ కోలీవుడ్​ స్టార్​.ఆ స్టార్ ఎవరంటే, అది మరో ఆసక్తికరమైన ట్విస్ట్. కోలీవుడ్‌లో ఈ పాటతో గ్లోబల్ ఫేమ్ పొందిన హీరో, తమిళ సినిమాను బాలీవుడ్, హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన మల్టీ-టాలెంటెడ్ ఆర్టిస్ట్. అతను కేవలం యాక్టర్ కాదు, రైటర్, ప్రొడ్యూసర్, సింగర్ కూడా. ఆయనే కోలీవుడ్​ స్టార్ హీరో ధనుష్! అవును, ఈ పాట ఆయన గొంతులోనే జన్మించింది. ధనుష్​ మాటల్లోనే చెప్పాలంటే, ఈ పాట అసలు కామెడీగా మాత్రమే రూపొందింది. ‘త్రీ’ సినిమాలో భాగంగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కలిసి సరదాగా ఆ పాట రికార్డ్ చేశారు. టాంగ్లిష్ లిరిక్స్.. తమిళం, ఇంగ్లీష్ మిక్స్. ఒక సీరియస్ ట్రాక్ కాదు, కేవలం ఫన్ ఎలిమెంట్. ‘ఈ పాటను అసలు కామెడిగా చేశాం. ఓ సారి సరదాగా ఈ పాట చేసి వదిలేశాం. పూర్తిగా మర్చిపోయాం కూడా. మరో పాటల పనుల్లో బిజీ అయ్యాం’ అని గుర్తుచేసుకున్నారు ధనుష్​. ఒక రోజు స్టూడియోలో అనిరుధ్ సిస్టమ్‌లో ఆ ట్రాక్ కనిపించింది. మళ్లీ విని, ‘ఫన్నీగా ఉంది, ట్రై చేద్దాం’ అని అప్‌లోడ్ చేశారు. ఆశ చిన్న రీజియనల్ హిట్ మాత్రమే. కానీ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన క్షణం నుంచి మ్యాజిక్ మొదలైంది. మరుసటి రోజు, వ్యూస్ బాంబులా పేలాయి. ప్రస్తుతం 560 మిలియన్ వ్యూస్​ దాటి, ఇండియన్ మ్యూజిక్ చార్ట్‌లలో రికార్డులు సృష్టించింది.ఈ పాట వైరల్ అవ్వడం వెనుక ఉన్న కారణాలు ఆసక్తికరం. 2011లో సోషల్ మీడియా ఇంకా బేబీ స్టెప్స్ వేస్తుండగా, ఈ ట్రాక్ వైరల్ మార్కెటింగ్‌కు కొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రతి ఒక్కరూ పాట పాడుతూ, పేరడీలు చేస్తూ, రీమిక్స్‌లు తయారు చేస్తూ షేర్ చేశారు. కాలేజీలు, ఆఫీసులు, పార్టీలు.. ఎక్కడ చూసినా ‘కొలవెరి’ ఫీవర్.తమిళ సినిమాలో హీరోలు ఎప్పుడూ రొమాంటిక్, యాక్షన్ ట్రాక్‌లతో ఫేమస్ అవుతారు. కానీ ఈ పాట, సాధారణమైన బ్రోకెన్ ఇంగ్లీష్‌తో, హ్యూమర్‌తో ప్రపంచాన్ని కదిలించింది. ‘మా భాష తమిళం ప్రపంచంలోనే పాత భాషల్లో ఒకటి. కానీ ఈ పాట మాత్రం నిజమైన తమిళంలో కాదు… టాంగ్లిష్‌లో వచ్చింది’ అని చెప్పుకొచ్చారు ధనుష్​. ఇది తమిళ సినిమాను గ్లోబల్ మ్యాప్‌లో ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లింది.అయితే, ఈ విజయం వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. పాట వైరల్ అయిన తీరు ధనుష్​కే ఆశ్చర్యం కలిగించిందట. ‘నాకు గర్వంగా ఉంది… కానీ దీని నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తుంటా. అది నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది’ అని చిరునవ్వుతో అన్నారు. ఈ పాట ఆశీర్వాదమా, శాపమా అని ప్రశ్నించుకున్నారు. ఎందుకంటే, అది ఆయన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అయినప్పటికీ, ప్రతి ఇంటర్వ్యూలో, ప్రమోషన్‌లో ఈ పాటే హైలైట్ అవుతుంది.ఆయన ప్రయత్నాలు, ఆయన ఇతర టాలెంట్‌లు షాడోలో పడిపోతున్నాయని ఫీల్ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్స్‌లో ధనుష్ లాంటి వాళ్లు, వైరల్ వేవ్‌లను రైడ్ చేస్తూ, తమ టాలెంట్‌ను ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ‘కొలవెరి’ శాపమా అంటే? బహుశా కాదు – అది ఒక లెసన్, ఒక మెమరీ, ఒక గ్రేట్ స్టార్ట్!

Scroll to Top