PS Telugu News
Epaper

జాతి అభివృద్ధి కోసం హర్నిషలు కృషి చేస్తా డాక్టర్ శంకర్ నాయక్

📅 21 Nov 2025 ⏱️ 1:47 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 21 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

భద్రాద్రి జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మెన్ డాక్టర్ శంకర్ నాయక్ కు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం జాతి అభివృద్ధి కోసం హర్నిషలు కృషి చేస్తా డాక్టర్ శంకర్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక పోస్టాఫీసు సెంటర్ నందు ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ అధ్యక్షతన బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు
ఈ సందర్భంగా ఆయన దేశవిదేశాలలో చేస్తున్న వైద్యసేవలను బంజారా ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. అదేవిధంగా జిల్లా తుల్జా భవాని మాత ఆలయ నిర్మాణంలో విశేష కృషి చేస్తున్నారని,అలాగే జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవో పునరుద్ధరణకు భవిష్యత్తు కార్యచరణ రూపొందించాలని అన్నారు.
అనంతరం సన్మాన గ్రహీత డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ… బంజారా జాతి ఉపాద్యాయ సంఘాలు తనను ఆహ్వానించి సన్మానించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బంజారా జాతి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల కోసం తన పరిధిలో కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా
తుల్జా భవాని మాత జాతర ఫిబ్రవరి నెలలో జరుపుతామని దీనికి అందరూ అమ్మవారి సేవలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా హైదరాబాదులో గల బంజారా హాస్పిటల్ సేవలను అందరు ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ గారికి శాలువాతో సత్కరిం చారు వారితోపాటు మొక్కలు నాటే కార్యక్రమంలో చిన్నారి బాలుడు విశ్వామిత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి, కలెక్టర్ గారితో అనేకమార్లు అవార్డు అందుకున్న సందర్భంలో జేఏసీ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు భూక్య కిషోర్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ రాజయ్య, గ్రీన్ ఎర్త్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ రాథోడ్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రవి, జిల్లా నాయకులు మోతిలాల్ ,టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోతు హరిలాల్, ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు బట్టుటీ చందర్, టి ఎస్ పి టి ఏ జిల్లా అధ్యక్షులు బాదావత్ మోతిలాల్ , మాలోత్ బాలు ఎటాక్ జిల్లా అధ్యక్షులు, మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ సెక్రెటరీ ఎస్ ఆమని, మెడికల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ ఏ మాలి, లాల్ సింగ్, కాన్సిరాం టీఎస్ టీ టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బాబూలాల్, ఎం ఈ సి పి జిల్లా నాయకులు ఎం అశోక్ చోహన్, యుటిఎఫ్ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరావు లక్ష్మన్, టీఎస్ టిటిఎఫ్ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, వీరభద్రం, లక్ష్మీదేవి పల్లి పి ఆర్ టి యు మండల అధ్యక్షులు హిరలాల్, పి ఆర్ టి యు బూర్గంపాడు మండల నాయకులు వెంకట్, ఉపాధ్యాయ ఉద్యోగ మండల జిల్లా నాయకులు, చందర్ నాయక్, గూగుల్ బద్రు, ధరావత్ధారియ, జయరాం, తారా సింగ్ , బాలు, కిరణ్ కుమార్, సీతారాం, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top