PS Telugu News
Epaper

చిన్నారుల సంక్షేమానికి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ కీలక ప్రోత్సాహం

📅 21 Nov 2025 ⏱️ 2:23 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కర్నాటకలోని సత్య సాయి గ్రామంలో ఉన్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్పటల్స్ ప్రపంచంలోనే బిల్లింగ్ కౌంటర్ లేని ఆస్పత్రులకు కేరఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ హాస్పిటల్‌ తాజాగా మరో ఘనత సాధించింది. 100 రోజుల్లో 100 మంది చిన్నారులకు ఉచితంగా హృదయ శస్త్రచికిత్సలు నిర్వహించి మరో రికార్డు సృష్టించింది. లండన్‌కి చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.న్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం 97వ రోజు కార్యక్రమంలో సంస్థ హార్ట్ వాల్వ్ బ్యాంక్ డైరెక్టర్ డా. సి.ఎస్. హీరేమఠ్ రోబోటిక్ సర్జరీ సహా అనేక రకాల హృదయ శస్త్రచికిత్సల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. సంజీవ్ నిచాని మాట్లాడుతూ.. భగవాన్ సత్య సాయి బాబా జన్మ శతాబ్ది సందర్భంగా పిల్లల కోసం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇందుకోసం ప్రపంచ స్థాయి వైద్య బృందం పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్యుల్ని, ఇతర సిబ్బందిని సద్గురు శ్రీ మధుసూదన్ సాయి అభినందించారు. “100 రోజుల్లో 100 సర్జరీలు పూర్తి చేయడం సులభం కాదు. ప్రతి రోజూ సవాళ్లు ఎదురయ్యాయి. వైద్య బృందం నిబద్ధతతో పనిచేసింది.” అని సద్గురు అన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు, వారికి ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్, చిరంజీవి భవ’ సర్టిఫికెట్లు అందజేశారు.వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో 13 రాష్ట్రాల్లో 100 సాయి స్వాస్థ్య కేంద్రాలు ఉచితంగా సేవలందిస్తున్నాయి. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఆద్వర్యంలో గడిచిన 50 రోజుల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో 76 కొత్త సాయి స్వస్థ్య వెల్‌నెస్ కేంద్రాలను ప్రారంభించారు. అలాగే 3 నుంచి 7 ఏళ్ల పిల్లల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంచేందుకు సహాయపడే Be Good – See Good – Do Good అనే పుస్తకాన్ని సద్గురు శ్రీ మధుసూదన సాయి విడుదల చేశారు. ఈ పుస్తకం ఫిజీ, జపాన్, మలేషియా, సింగపూర్, అమెరికా సహా 17 దేశాల భాషల్లో అందుబాటులో ఉన్నట్టు ఆయన తెలిపారు.

Scroll to Top