పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు
బడా బాబుల పాలైన బడి స్థలం
పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు
పాఠశాల అభివృద్ధికి దాత కేటాయించిన స్థలం అన్యాక్రాంతం
కలెక్టర్‌కు ఏన్కూర్ ప్రజల వినతి
పయనించే సూర్యుడు నవంబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన దుకాణాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాఠశాల అభివృద్ధి కోసం దాత మాదినేని అప్పమ్మ విరాళంగా ఇచ్చిన స్థలం కొందరు ఆర్థికంగా రాజకీయంగా బలమైన లీజుదారుల చేతుల్లో అక్రమ సంపాదనకు ప్లాట్ ఫామ్ గా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.నెలకు కేవలం రూ.1500 నామమాత్రపు అద్దె చెల్లిస్తూ, అదే దుకాణాలను ఇతరులకు పదివేల రూపాయలకు పైగా సబ్ లీజు ఇవ్వడం ద్వారా భారీగా లాభాలు పొందుతున్నారని వారు పేర్కొన్నారు.కొంతమంది లీజుదారులు పాఠశాల స్థలాన్నే సొంతంగా భావించి విక్రయ ప్రయత్నాలు కూడా చేస్తున్నారని గ్రామస్థుల ఆరోపణ.ఈ అక్రమాలపై విచారణ జరిపి పాఠశాల స్థలాన్ని తిరిగి రక్షించాలని, నిజమైన నిరుపేద వ్యాపారులకు దుకాణాల కేటాయింపు ఇవ్వాలని, పాఠశాల అభివృద్ధికి దాతల ఆశయాలకు న్యాయం చేయాలని ఏన్కూర్ ప్రజలు స్థానిక అధికారులను జిల్లా కలెక్టర్ ను కోరుతూ వినతి పత్రం అందజేశారు.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం పాత దుకాణాల స్థానంలో పక్కా భవనాలు నిర్మిస్తే 40 కుటుంబాలకు ఉపాధి లభించడంతో పాటు పాఠశాల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. లీజుదారులు అక్రమంగా సంపాదించిన రూపాయలను కూడా తిరిగి పాఠశాల ట్రెజరీకి అప్పజెప్పే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్