58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం
పయనించే సూర్యుడు నవంబర్ 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని ఆదురుపల్లిలో డియర్. బి ఆర్ అంబేడ్కర్ గురుకులం స్కూల్లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడంతో పాటు లైబ్రరీ వినియోగంపై ఆసక్తి కలిగించేందుకు డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, సింగింగ్, పెయింటింగ్ 225 పోటీలను నిర్వహించారు. చివరి రోజు విజేతలకు బహుమతులు ప్రదానం అందజేశారు . ప్రిన్సిపల్ పద్మజి, లైబ్రేరియన్ శ్యామకుమారి, టీచర్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.