PS Telugu News
Epaper

“హిడ్మా ఎన్‌కౌంటర్… మావోయిస్టుల కీలక ప్రకటనతో ఉత్కంఠ”

📅 21 Nov 2025 ⏱️ 3:54 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మావోయిస్టు మోస్ట్ వాంటెడ్, కేంద్ర కమిటీ మెంబర్ మాడ్వి హిడ్మా ఎన్‌‌కౌంటర్‌పై కేంద్ర కమిటీ కీలక లేఖ విడుదల చేసింది. ఏపీలోని విజయవాడకకు నవంబర్ 15వ తేదీన మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉండగా చికిత్స కోసం వెళ్లిన హిడ్మాను పోలీసులు పట్టుకుని హత్య చేశారని, ఆ తర్వాత బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సంచలన లేఖ విడుదల చేశారు. కాగా, ఆయనతో పాటు రాజే, హిడ్మా భార్య హేమను ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా, ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్‌తో పాటు మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి ఆ తర్వాత రంపచోడవరం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేసినట్లు కట్టుకథ అల్లుతున్నారని వెల్లడించారు. ఈ హత్యలకు వ్యతిరేకంగా నవంబర్ 23వ తేదీన దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ లేఖలో దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయోజనాల కోసం మావోయిస్టులను హత్య చేయిస్తున్నట్లు ఆరోపించారు. హిడ్మాతో పాటు అతని భార్య, కొంతమంది చికిత్స కోసం విజయవాడ వెళ్లగా.. పోలీసులు సమాచారంతో పట్టుకున్నారని ఆరోపించారు.

Scroll to Top