‘ది రాజా సాబ్’ మ్యూజిక్ ఫ్యాన్స్ కోసం స్పెషల్
పయనించే సూర్యుడు న్యూస్ :సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాజాసాబ్’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ సాంగ్ అప్డేట్ రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండగా ప్రమోషన్లు మొదలుకావడం లేదు అనే ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కు మేకర్స్ శుక్రవారం సూపర్ గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. కొన్ని రోజులుగా ది రాజా సాబ్ సినిమా మ్యూజిక్ రైట్స్ విషయంలో నెలకొన్న సమస్యల కారణంగా నిలిచిపోయిన ఫస్ట్ సింగిల్ ఇప్పుడు నవంబర్ 23న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించే కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మల్టీ కలర్ షర్ట్, బ్లాక్ కార్గో ప్యాంట్ ధరిచి జాతరలో నిల్చుని ఉన్న ప్రభాస్ లుక్ ఫ్యాన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటోంది. వెనుకన గుడి సెటప్, డ్యాన్సర్స్ హంగామా ఉండటంతో పాటలో ఎనర్జీ లెవల్స్ ఏ రేంజ్లో ఉంటాయనేది తెలుస్తోంది.జాతర సాంగ్‌కు మేల్.. ఫిమేల్ రెండు వెర్షన్లు ఉండబోతున్నాయి. ‘రెబెల్ సాబ్’ అనే లిరిక్స్‌తో తెరకెక్కిన ఈ భారీ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రభాస్ స్టైల్, స్వాగ్, ఎంట్రీ..అన్నీ ఉండేలా ఫ్యాన్స్‌కు పక్కా ఫుల్ మీల్స్ స్టైల్లో సాంగ్ ట్రీట్ కానుంది.మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజాసాబ్’ పాన్ ఇండియా మూవీగా జనవరి 9న సంక్రాంతికి విడుదల కానుంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ నటిస్తుండగా, రిద్ది కుమార్, ఆనంది కీలక పాత్రల్లో కనిపించబోతుననారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్య పాత్రలో మెప్పించనున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను మొదట డిసెంబరులో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ బడ్జెట్, డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థనల కారణంగా విడుదలను సంక్రాంతికి మార్చారు. మరి సంక్రాంతి రేసులో ప్రభాస్ ‘రాజాసాబ్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.